
హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంచుతూ ఎండీ వి.పి. గౌతమ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం కార్పొరేషన్ ఫైనాన్స్ జీఎం సర్క్యులర్‌ను విడుదల చేశారు. జూన్ నెల జీతంతో కొత్త డీఏ జమ అవుతుందని సర్క్కులర్ లో పేర్కొన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఇతర శాఖల్లో డిప్యూటేషన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ డీఏ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలను రిలీజ్ చేయడంతో పాటు హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులకు సైతం ఇచ్చారు.
ఈ సందర్భంగా హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎండీ విపి. గౌతమ్ కు వర్క్ ఇన్ స్పెక్టర్ ఏఈ అసోసియేషన్ నేతలు గవ్వ రవీందర్ రెడ్డి, వెంకటరాంరెడ్డి, కుమార్ లు కృతజ్ఞతలు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో కీలకంగా ఉన్న రెగ్యులర్ ఏఈ, డీఈఈలకు వెహికిల్ అలవెన్స్ ఇవ్వాలని సోమవారం పత్రిక ప్రకటనలో నేతలు కోరారు.