జేడీ వాన్స్ వ్యాఖ్యలు అభ్యంతరకరం..హెచ్ 1 బీ ఉద్యోగులను వెట్టి చాకిరీ బానిసలంటారా?

జేడీ వాన్స్ వ్యాఖ్యలు అభ్యంతరకరం..హెచ్ 1 బీ ఉద్యోగులను వెట్టి చాకిరీ బానిసలంటారా?
  •     బానిసత్వాన్ని గుర్తు చేసేలా మాట్లాడారు
  •     అమెరికా అభివృద్ధిలో భారతీయ నిపుణుల పాత్ర కీలకం
  •     వాన్స్ తీరుపై విదేశాంగ శాఖ ఆగ్రహం

న్యూఢిల్లీ: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ టెకీలను ‘వెట్టిచాకిరీ బానిసలు’ అంటూ ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ ఖండించింది. హెచ్-1బీ వీసాల కింద పనిచేస్తున్న ఉద్యోగులను ఉద్దేశించి ఆయన  ‘వెట్టిచాకిరీ బానిసలు’ (ఇండెంచర్డ్ సర్వెంట్స్) అన్నారు. ఇలాంటి పదజాలం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొంది. నాటి బానిసత్వాన్ని గుర్తుచేసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని తప్పుబట్టింది. 

అమెరికా ఆర్థిక ప్రగతిలో భారత నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఎంఈఏ పేర్కొంది. ఉన్నత విద్య, నైపుణ్యాలు కలిగిన భారత నిపుణుల సేవలను విస్మరిస్తూ ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సరికాదని తేల్చిచెప్పింది.