పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుదాం: సీఎస్ సోమేశ్ కుమార్

పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటుదాం: సీఎస్ సోమేశ్ కుమార్

పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో మిషన్‌ వెూడ్‌ తరహాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశంపై అన్నిశాఖలు దృష్టిసారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. అర్బన్‌ ఫారెస్ట్ లపై ఇవాళ(శుక్రవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవనంతో పాటు ఆక్రమణల నుంచి కాపాడాలన్నారు సోమేశ్ కుమార్. సీఎం కేసీఆర్‌ విజన్‌ను అమలుచేయడానికి అధికారులు పచ్చదనాన్ని పెంపొందించడానికి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో 129 లొకేషన్లలోని 188 ఫారెస్ట్‌ బ్లాక్ లకు సంబంధించి 1.60 లక్షల ఎకరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నివసించడానికి మొక్కలు నాటడానికి వీలున్న ప్రతి చోటా పెద్దయెత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని అధికారులను కోరారు.

GHMC ద్వారా సమగ్ర రోడ్ ‌మేనేజ్‌మెంట్‌ కార్యక్రమం కింద చేపడుతున్న రోడ్లకు రెండు వైపుల, శ్మశాన వాటికలు, పాఠశాలలు, చెరువులు వెంట పెద్దయెత్తున మొక్కలు నాటి విజిబుల్‌ ఇంపాక్ట్ కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు సోమేశ్ కుమార్.