
అత్యాధునిక, పోర్టబుల్ పీమార్ట్ సెంటర్‌ను హైదరాబాద్ చెంగిచర్లలోని మీట్ రీసర్చ్ సంస్థ డెవలప్ చేసింది. గొర్రెలు, మేకలను వధించేందుకు.. మాంసం అమ్మకాన్ని జరిపేందుకు .. అతితక్కువ ధరలో పీమార్ట్‌ను రూపొందించారు. చిన్న స్థాయిలో మాంసం విక్రయించేవారికి ఈ పీమార్ట్ యూనిట్లు ఎక్కువగా ఉపయోగపడనున్నట్లు రీసర్చ్ సంస్థ సైంటిస్టులు తెలిపారు. రోజుకు పది మేకలను వధించే రీతిలో పీమార్ట్‌ను డెవలప్ చేశారు. నాలుగు గదుల రూపంలో ఈ పోర్టబుల్ పీమార్ట్ ఉంటుంది. పీమార్ట్ వెహికిల్ ను మనకు అనుకూలంగా ఉండే ప్రాంతానికి ఈజీగా తరలించే అవకాశం కూడా ఉంది. మేకలు, గొర్రెల కోసం ఓ కేజ్, వాటిని వధించేందుకు ఒక కేజ్, మాంసాన్ని కట్ చేసి ప్యాక్ చేసేందుకు మరో యూనిట్, మాంసాన్ని రిటేల్‌గా అమ్మేందుకు మరో యూనిట్ పీమార్ట్‌లో ఉంటుంది. పీమార్ట్ టెక్నాలజీ చిన్న తరహా మాంస వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుందని మీట్ రీసర్చ్ సంస్థ తెలిపింది. అపరిశుభ్రంగా ఉండే కబేళాల కన్నా.. పీమార్ట్‌లో జంతు వధ, మాంస అమ్మకం.. చాలా పరిశుభ్రమైన పద్ధతిలో ఉంటుందన్నారు మీట్ రీసర్చ్ సంస్థ సైంటిస్టులు.