మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన

మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన
  • మెదక్, మాసాయిపేటలో 11 సెంటీమీటర్ల వర్షం
  • పలుచోట్ల కొట్టుకుపోయిన వడ్లు

మెదక్, వెలుగు: జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు వాన దంచి కొట్టింది. మెదక్ పట్టణంలో, మాసాయిపేటలో రికార్డు స్థాయిలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్​ మండలం రాజ్​పల్లిలో 9.8,  కొల్చారంలో 8.5,  వెల్దుర్తిలో 8.5, చేగుంటలో 7.6, తూప్రాన్​ మండలం ఇస్లాంపూర్​లో 7.4, మనోహరాబాద్​లో 5.3, నిజాంపేట మండలం నార్లాపూర్​లో 5.1, చిన్నశంకరంపేటలో 5.1, కౌడిపల్లిలో 4.7, శివ్వంపేటలో 4.1, వెల్దుర్తి మండలం దామరంచలో 4‌, రామాయంపేటలో3 సెంటీమీటర్ల వర్షాపాతం నమోందైంది. భారీ వర్షంతో ఆయా చోట్ల రోడ్లు జలమయమయ్యాయి.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వరదకు కొల్చారం మండలం రాంపూర్​ వద్ద 765 డీ నేషనల్​ హైవే మీద ఆరబోసిన వడ్లు కొట్టుకుపోయాయి. గత మూడు, నాలుగు రోజులుగా వర్షం పడుతూ తడిసి పోవడంతో వడ్లకు మొలకలు వచ్చాయి. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయాల్సి ఉండగా మళ్లీ ఆకాశం మేఘావృతమై ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.