
మెదక్ టౌన్, వెలుగు: స్టేట్సబ్ జూనియర్ అథ్లెటిక్స్చాంపియన్షిప్-2025, అండర్ 8, 10, 12 బాలబాలికల ఎంపిక శనివారం మెదక్ పట్టనంలోని అథ్లెటిక్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా నుంచి150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. మూడు విభాగాల్లో ఎంపికలు జరిగాయి. కార్యక్రమానికి డాక్టర్ సూఫీ హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేసి మాట్లాడారు. శారీరకంగా, మానసికంగా క్రీడలు ఎంతో దోహద పడతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు.
వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జూన్ 1న హైదరాబాద్లోని జింఖానా గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కార్యక్రమంలో మెదక్ డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ మధుసూదన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, నరేశ్, పీడీ చంటి, పీఈటీ అర్జున్, క్రీడాకారులు పాల్గొన్నారు.