
మెదక్ జిల్లా అంటేనే ఉద్యమాల జిల్లా అని… సీఎం కేసీఆర్ కు వెన్ను దన్నుగా నిలిచిన జిల్లా అని అన్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సీఎం కృషి వల్లే మెదక్, సిద్దిపేట జిల్లాలు ఏర్పడ్డాయన్నారు. మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన… ప్రతీ ఉద్యమంలో మెదక్ జిల్లా ముందుందన్నారు. మెదక్ జిల్లా అంటేనే మెతుకుసీమ.. అందరికీ అన్నం పెట్టిన జిల్లా అన్నారు. గజ్వేల్, మెదక్‌కు రెండు నెలల్లో రైలు రానుందన్నారు. దేశానికే ఆదర్శంగా గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతోందన్నారు. కేసీఆర్ ఈ జిల్లా బిడ్డ కావడం వల్లే అభివృద్ధి సాధ్యమవుతోందని… సీఎం కు కృతజ్ఞత చెప్పాలంటే మెదక్ పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ సారి ఐదు లక్షల మెజార్టీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించి తమ సత్తా నిరూపించాలని పిలుపు నిచ్చారు హరీష్ రావు.