సిటిజన్​ ఫీడ్ బ్యాక్​లో రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా మెదక్

సిటిజన్​ ఫీడ్ బ్యాక్​లో రాష్ట్రంలోనే ఉత్తమ జిల్లాగా మెదక్
  • ఉత్తమ పీఎస్ గా నర్సాపూర్

మెదక్/ నర్సాపూర్​, వెలుగు: పోలీస్​సేవల క్యూఆర్‌‌ కోడ్‌‌ ఫీడ్ బ్యాక్ లో ఉత్తమ జిల్లాగా మెదక్  ఎంపికైంది. నర్సాపూర్​ పోలీస్​ స్టేషన్​ ఉత్తమ పీఎస్ గా సెలెక్ట్ అయింది. పోలీసుల పనితీరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జనవరి 9న  క్యూఆర్‌‌ కోడ్‌‌ ఆఫ్ సిటిజన్ ను డీజీపీ జితేందర్ ఆవిష్కరించారు. జనవరి నుంచి ఇప్పటివరకు  ప్రజల ఫీడ్​బ్యాక్ ఆధారంగా అన్ని జిల్లాలకు ర్యాంక్ లు కేటాయించారు. అందులో మెదక్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. సిటిజన్ ఫీడ్ బ్యాక్ లో  రాష్ట్రంలో ఉత్తమంగా ఎంపికైన 10 పోలీస్ స్టేషన్లలో మెదక్ జిల్లాకు చెందిన నర్సాపూర్ తొలిస్థానం, తూప్రాన్ పీఎస్ కు 4వ స్థానం దక్కాయి.

అదేవిధంగా పోక్సో కేసుల్లో ఐఓగా ఉండి 60 రోజుల్లోపే ఎక్కువగా చార్జ్ షీట్లను వేసినందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకట్ రెడ్డి రాష్ట్రంలో  రెండో స్థానం పొందారు. బుధవారం హైదరాబాద్ లోని డీజీపీ ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ఎస్పీ మహేందర్, నర్సాపూర్​ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓ లింగం, తూప్రాన్  ఎస్​హెచ్​ఓ శివానందంకు  డీజీపీ సర్టిఫికెట్​ లు అందించారు.  తూప్రాన్​డీఎస్పీ వెంకట్​రెడ్డికి అడిషనల్ జీపీ అనిల్ కుమార్ సర్టిఫికెట్​ అందజేశారు.