మెదక్ జిల్లాలోని వడియారం రైల్వేస్టేషన్ లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వినతి పత్రం అందించారు. నిజామాబాద్, తిరుపతి, రాయలసీమ ఎక్స్ ప్రెస్ వడియారం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేలా చూడాలని కోరారు. ఈ నిర్ణయంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, మెదక్, రామయంపేట, తూప్రాన్ కు వడియారం రైల్వే స్టేషన్ కేంద్రంగా ఉంటుందని వివరించారు. ట్రైన్ ఆగడం వల్ల వేలాది మంది ప్రయాణికులకు లబ్ది జరుగుతుందని, తక్షణమే ఆమోదించాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు వినతి పత్రం అందజేశారు.
