వుషులో ఇండియాకు ఐదు మెడల్స్‌‌‌‌

వుషులో ఇండియాకు ఐదు మెడల్స్‌‌‌‌

మకావు: శాండా వుషు వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇండియా ప్లేయర్లు పతకాల పంట పండించారు. రెండు స్వర్ణాలు, ఒక రజతం, రెండు కాంస్యాలతో కలిసి మొత్తం ఐదు పతకాలు గెలిచారు. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌‌‌ 75 కేజీల ఫైనల్లో శివాని.. రష్యా ప్లేయర్‌‌‌‌పై గెలిచి గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ను సొంతం చేసుకుంది. 

ఆరంభం నుంచే అద్భుతమైన నైపుణ్యంతో ఆడిన శివాని కీలక టైమ్‌‌‌‌లో వరుసగా పాయింట్లు సాధించింది. ఇక మెన్స్‌‌‌‌ 48 కేజీల విభాగం ఫైనల్లో కుశాల్‌‌‌‌ కుమార్‌‌‌‌..  చైనా ప్లేయర్‌‌‌‌ చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌ను సాధించాడు. కరీనా కౌశిక్‌‌‌‌, సాగర్‌‌‌‌ దహియా తమ విభాగాల్లో బ్రాంజ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ను నెగ్గారు.