తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తులతో సందడిగా మారింది. ఆదివారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు చేసి, జంపన్న నాగులమ్మ గద్దెలకు ఉన్న గ్రిల్స్ కు ముడుపులు కట్టారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీరసారెలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం పరిసరాల్లోని వనం, శివరాం సాగర్, జంపన్న వాగు, చిలకలగుట్ట తదితర ప్రాంతాల్లో విడిది చేశారు. ఆదివారం ఒక్కరోజే 10 వేల మంది భక్తులు దర్శనానికి వచ్చినట్లు ఎండోమెంట్ ఈవో వీరేశం తెలిపారు.
