5వ రోజు మేడారం హుండీ ఆదాయం ఎంతంటే

5వ రోజు మేడారం హుండీ ఆదాయం ఎంతంటే

హనుమకొండ: మేడారం జాతర సందర్భంగా నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ ఆదివారం 5వ రోజు లెక్కింపు కొద్దిసేపటి క్రితం పూర్తయింది. టిటిడి కళ్యాణ మండపంలో జరిగిన 5వ రోజు హుండీల లెక్కింపు వివరాలను అధికారులు ప్రకటించారు. మొత్తం హుండీలు  497 ఏర్పాటు చేయగా.. ఇవాళ్టి వరకు 450 హుండీల లెక్కింపు పూర్తయింది. ఇవాళ ఒక్కరోజు కోటి రూపాయల 50 లక్షల 15వేలు నగదు రూపంలో వచ్చింది. మొత్తం ఇవాళ్టి వరకు అంటే 5 రోజుల ఆదాయం రూ. 9 కోట్ల, 78 లక్షల 96 వేల 980 నగదు రూపంలో వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 
 
మొదటి రోజు కౌంటింగ్ :  కోటి 34 లక్షల 60 వేలు.

రెండో రోజు కౌంటింగ్ :   2 కోట్ల 50 లక్షల 62 వేలు. 

మూడో రోజు  కౌంటింగ్: కోటి 53 లక్షల 37 వేల 100

నాలుగవ రోజు కౌంటింగ్: 2 కోట్ల 90 లక్షల 22 వేల 880

5వ రోజు కౌంటింగ్: 1 కోటి 50 లక్షల 15 వేలు.

 

ఇవి కూడా చదవండి

థియేటర్లు సీజ్‌ చేయలేదు..అదంతా దుష్ప్రచారం

రష్యా సైన్యంపై తిరగబడుతున్న పిల్లలు, మహిళలు

ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్

ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు