ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్

ఉక్రెయిన్ అధ్యక్షుడి ధైర్యసాహసాలకు హ్యాట్సాఫ్
  • అమెరికా మాజీ  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్

తాను అమెరికా  అధ్యక్షుడి  స్థానంలో ఉండి ఉంటే  రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరిగి ఉండేది కాదన్నారు అమెరికా మాజీ  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఉక్రెయిన్ పై  రష్యా దాడి చేయడం అత్యంత భయంకమన్నారు. ఇవాళ ఫ్లోరిడాలో  జరిగిన కన్జర్వేటివ్  పొలిటికల్  యాక్షన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ట్రంప్ ఉక్రెయిన్ పై యుద్ధం చేయడాన్ని ప్రస్తావించి  బైడెన్ సర్కార్ పై  విరుచుకుపడ్డారు. రష్యా మానవాళిపై  దాడి చేస్తోందని అన్నారు. దీనికి కారణం బైడెన్  నేతృత్వంలోని  అమెరికన్ అడ్మినిస్ట్రేషనేనని  ఆరోపించారు. మరోవైపు అసమాన ధైర్యసాహసాలు  ప్రదర్శిస్తున్న  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తారు. యుద్ధ ప్రదేశం నుండి సురక్షిత స్థానానికి తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆఫర్ ఇచ్చినా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు తోసిపుచ్చి సైన్యంతో కలసి పోరాటం చేస్తుండడం అత్యంత స్ఫూర్తిదాయకమన్నారు. యుద్ధం నుండి ఉక్రెయిన్ త్వరగా  కోలుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. 

 

ఇవి కూడా చదవండి

కూతురు మృతి.. దుఃఖాన్ని దిగమింగి సెంచరీ చేశాడు

ఏపీ సర్కార్‌‌పై ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు

పార్టీ ప్రక్షాళన కోసమే డిజిటల్ సభ్యత్వ నమోదు