మేడారం జాతర యాప్, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ రెడీ!..అందుబాటులోకి ‘మై మేడారం’ వాట్సాప్ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్

మేడారం జాతర యాప్, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ రెడీ!..అందుబాటులోకి ‘మై మేడారం’ వాట్సాప్ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్
  •     రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్ నుంచి మిస్సింగ్ కేసుల దాకా అన్నీ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే
  •     అధికారిక వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ప్రత్యేక యాప్ ఆవిష్కరణ

హైదరాబాద్, వెలుగు: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. మహా జాతరను పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైటెక్ సేవలందిస్తున్నది. ఈ మేరకు అధికారులు ప్రత్యేకంగా మొబైల్ యాప్, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్, వాట్సాప్ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 

మేడారం జాతరకు సంబంధించిన సమస్త సమాచారాన్ని అరచేతిలో చూసుకునేలా వీటిని రూపొందించారు. జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులు రూట్ మ్యాప్స్, పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం ఇబ్బంది పడకుండా ‘మేడారం జాతర’ పేరుతో ప్రత్యేక మొబైల్ యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, https://medaramjathara2026.com పేరుతో వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు.  

వీటితోపాటు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ సులభంగా ఉండేలా 76589 12300 నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ‘మై మేడారం’ వాట్సాప్ చాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాట్ సేవలను కూడా ప్రారంభించారు. ఈ డిజిటల్ ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భక్తులకు అవసరమైన సమాచారాన్ని పొందుపరిచారు. ఈ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హాయ్​ అని మెసేజ్ చేస్తే చాలు సమాచారం మీ మొబైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వస్తుంది. 

అంతేకాదు, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్లో జాతర సమస్త సమాచారం పొందుపరిచారు. జాతరకు వెళ్లే రహదారులు, ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేలా రూట్స్​ సెట్​ చేశారు. మంచినీటి కేంద్రాలు, టాయిలెట్ బ్లాక్స్, స్నానఘట్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గూగుల్ మ్యాప్ లో లొకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా తెలుసుకోవచ్చు.  మెడికల్ క్యాంపులు ఎక్కడున్నాయి? హెల్ప్ డెస్క్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు అందుబాటులో ఉంటాయి. 

అంతేకాకుండా, జాతరలో ఎవరైనా తప్పిపోతే వెంటనే రిపోర్ట్ చేసే సిస్టమ్, ఇతర సమస్యలపై ఫిర్యాదులు  చేసే అవకాశం కల్పించారు. వీటితోపాటు మేడారం జాతర చరిత్ర, అమ్మవార్ల విశిష్టతను కూడా ఇందులో పొందుపరిచారు. భక్తులు ఈ సాంకేతిక సేవలను వినియోగించుకుని, జాతరను విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు.