
కరోనాతో పోరాడుతూ మేడ్చల్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈఓ) ఆర్.పి. భాస్కర్ మరణించారు. ఆయనకు ఈ నెల 5న జ్వరం రావటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కొద్దిరోజులుగా రెండు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించటంతో కుటుంబ సభ్యులు సోమవారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. భాస్కర్ 2018లో మేడ్చల్ జిల్లా డీఐఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పట్టుదలతో పనిచేసి మేడ్చల్ జిల్లాను ఇంటర్ ఫలితాల్లో ప్రథమ స్థానంలో నిలిపారు.
For More News..