మేధా పాట్కర్‌‌‌‌‌‌కు ఐదు నెలల జైలు శిక్ష

మేధా పాట్కర్‌‌‌‌‌‌కు ఐదు నెలల జైలు శిక్ష

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్‌‌ నాయకురాలు మేధా పాట్కర్‌‌‌‌కు ఐదు నెలల జైలు శిక్ష పడింది. పరువు నష్టం కేసుకు సంబంధించి ఢిల్లీ సాకేత్‌‌ కోర్టు సోమ వారం ఈమేరకు తీర్పు వెలువరించింది. అలా గే, ఆమె రూ.10 లక్షల పరిహారాన్ని బాధితుడికి చెల్లించాలని ఆదేశించింది. ప్రస్తుత ఢిల్లీ గవర్న ర్‌‌‌‌ ఎల్జీ వీకే సక్సేనా 23 ఏండ్ల క్రితం మేధా పాట్కర్‌‌‌‌పై క్రిమినల్‌‌ డిఫమేషన్‌‌ కేసు ఫైల్‌‌ చేశా రు.

ఈ కేసులో పాట్కర్‌‌‌‌ను ఢిల్లీ కోర్టు మే నెల లో దోషిగా తేల్చింది. ఈ తీర్పును సవాల్‌‌ చేసేం దుకు ఢిల్లీ సాకేత్‌‌ కోర్టు 30 రోజులు శిక్షను సస్పెండ్‌‌ చేసింది. అహ్మదాబాద్‌‌లోని నేషనల్‌‌ కౌన్సిల్‌‌ ఫర్‌‌‌‌ సివిల్‌‌ లిబర్టీస్‌‌ ఎన్జీవోకు చీఫ్‌‌గా వీకే సక్సేనా ఉన్న సమయంలో నర్మదా బచావో ఆందోళన్‌‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేయడంపై పాట్కర్‌‌‌‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, సక్సేనాపై కోర్టులో పిల్‌‌ దాఖలు చేశారు. మరోవైపు, ఓ టీవీ చానల్‌‌ ఇంటర్య్యూలో మేధా పాట్కర్‌‌‌‌ సక్సేనాను కించపరిచేలా మాట్లాడారు. దీంతో సీరియస్‌‌ అయిన ఆయన.. 2000లో పాట్కర్‌‌‌‌పై  పరువు నష్టం దావా వేశారు.