జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇచ్చేలా కృషి చేస్త: మీడియా అకాడమీ చైర్మన్

జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇచ్చేలా కృషి చేస్త: మీడియా అకాడమీ చైర్మన్

హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలపై ​మార్చి 5న  సీఎం రేవంత్ మీటింగ్ నిర్వహించనున్నారని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పదవీ బాధ్యత స్వీకరించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘హైదరాబాద్ కు 4 వైపులా జర్నలిస్టులకు ఇండ్ల జాగాలు ఇచ్చేలా కృషి చేస్తానని అన్నారు.  జవహర్ లాల్ సొసైటీ  కేస్ క్లియర్ అయిన గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఆ విషయం అల్లం నారాయణ కూడా ఒప్పుకున్నారని తేల్చి చెప్పారు.హెల్త్ కార్డ్ లు పని చేసేలా సీఎంతో మాట్లాడుతాన్నారు. -అవాస్తవాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. సోషల్ మీడియా పెద్ద ప్రమాదకరంగా మారింది. జర్నలిస్టుల ప్రమాణాలు పెంచుతా’  అని శ్రీనివాస్​రెడ్డి తెలిపారు.

ALSO READ :- రష్యాలో చిక్కుకున్న 20 మంది భారతీయులు