రష్యాలో చిక్కుకున్న 20 మంది భారతీయులు

రష్యాలో చిక్కుకున్న 20 మంది భారతీయులు

గత రెండు సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. 2022 ఫిబ్రవరి 22 రష్యా సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్ పై దాడులు ప్రారంభించింది. వాటిని ప్రతిఘటిస్తూ ఉక్రెయిన్ కూడా ప్రతి దాడులు చేస్తూ వస్తోంది. రష్యాలో 20 మంది భారతీయులు చిక్కుకున్నారు. వారు అక్కడి భారత రాయబారి కార్యాలయానికి వెళ్లి సంప్రదించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం  ఫిబ్రవరి 23న తెలుసుకుంది.  ఈ విషయాన్ని  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈరోజు తెలిపింది.

భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత్ తన వంతు ప్రయత్నం చేస్తోందని, రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈరోజు విలేకరులతో చెప్పారు.