1904లో మునిగిపోయిన పడవ.. ఇప్పుడు బయటకు వచ్చింది

1904లో మునిగిపోయిన పడవ.. ఇప్పుడు బయటకు వచ్చింది

120 ఏళ్ల క్రితం న్యూస్.. భారీ తుఫాను ధాటికి సముద్రంలో మునిగిపోయిన SS నెమెసిస్ ఓడ.. వారం రోజుల తర్వాత క్రోనుల్లా బీజ్ వద్ద శవాలు కొట్టుకు వచ్చాయి. కానీ ఓడ ఆచూకీ ఓ పజిల్ గానే మిగిలిపోయింది.SS నెమెసిస్ ఓడ మెల్ బోర్న్ కు బొగ్గు రవాణా చేస్తున్న నౌక. ఓడ ఇంజిన్ పనిచేయకపోవడంతో సముద్రం లోతుల్లో కూరుకు పోయింది. ఈ విధ్వంసంలో దాదాపు 40 మంది పిల్లలు వారి తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే చాలా కాలం తర్వాత SS నెమెసిస్ ఓడ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. సముద్ర గర్భ అన్వేషకులు ఈ SS నెమెసిస్ ఓడ ఆచూకీ కనుగొన్నారు. 

ALSO READ :- Vaddepalli Srinivas: ప్రముఖ జానపద గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత

1904 లో ఆస్ట్రేలియన్ తీరంలో జాడలేకుండా పోయిన బొగ్గు రవాణా ఓడ SS నెమెసిస్. శతాబ్ధం గడిచినా తర్వాత ఈ పడవ ఆచూకి కనుగొన్నారు సముద్ర గర్భ అన్వేషకులు. సబ్ సీ ఫ్రొఫెషనల్ మెరైన్ సర్వీసెస్.. 2022లో కోల్పోయిన కార్గో కోసం అన్వేశిస్తుండగా. 16 మైళ్ళ ఆఫ్ షోర్ లో 525 అడుగుల నీటి దిగువన ఈ ఓడ కనగొనబడింది. ఈ ఓడ శిథిలాలు ఇసుక మైదానంలో నిటారుగా చిక్కుకున్నట్లు గుర్తించారు.