- మంత్రి దామోదర రాజనర్సింహకు ఎంపీ ఆర్ కృష్ణయ్య వినతి
ముషీరాబాద్,వెలుగు: మెడికల్ కౌన్సిలింగ్ లో జీవో నంబర్ 550 ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. మెడికల్ కౌన్సిలింగ్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో అక్రమాలు, అవకతవకలను అరికట్టాలని కోరారు. ఆర్ కృష్ణయ్య శుక్రవారం సెక్రటేరియట్ లో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశారు.
కొందరు ఆఫీసర్లు 2019లో ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి కొత్త జీవో తీసుకొచ్చి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలులో అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. త్వరలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. జిల్లపల్లి అంజి, మోడీ రాందేవ్ పాల్గొన్నారు.
