మంకీపాక్స్​ కలకలం

మంకీపాక్స్​ కలకలం

కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్​ నెగెటివ్

హైదరాబాద్​/కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి కి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తికి మంకీ పాక్స్ నెగెటివ్​గా తేలింది. పుణె వైరాలజీ ల్యాబ్​లో అతని శాంపిల్స్​ చెక్​చేసిన డాక్టర్లు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అయితే అతనికి చికెన్​పాక్స్​ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వైద్యశాఖ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతం హైదరాబాద్​ఫీవర్​ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. 

ఖమ్మంలో మంకీపాక్స్​ కలకలం

ఖమ్మం నగరంలో మంకీపాక్స్​ కేసు కలకలం రేపుతున్నది. లక్నోకు చెందిన సందీప్​ (35) ఖమ్మం రూరల్​ మండలంలోని ఆరెంపుల గ్రామం గ్రానైట్​ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. 20న లక్నో నుంచి ఖమ్మం వచ్చాడు. ఇతనికి చేతులు, కాళ్లపై దద్దుర్లు రావడంతో ఆర్​ఎం పీ వైద్యుడిని సంప్రదించగా నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తీసుకువెళ్లాడు. మంకీ పాక్స్​ అనుమానంతో డీఎంహెచ్​ఓ డాక్టర్​ మాలతి ఆదేశాలతో హైదరాబాద్​ నల్లకుంటలోని ఫీవర్​ ఆసుప్రతికి తరలించారు.