రేపు వైద్యసేవలకు దూరం: CCIM

రేపు వైద్యసేవలకు దూరం: CCIM

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ (CCIM) ఆయుర్వేద డాక్టర్లు కూడా 58 రకాల శస్త్ర చికిత్స నిర్వహించవచంటూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కు నిరసనగా రేపు(శుక్రవారం) దేశ వ్యాప్తంగా వైద్య సేవలకు దూరంగా ఉంటున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ తెలిపింది. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు లవ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆయుర్వేద వైద్యం సనాతనమైనది అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఆయుర్వేద వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్లు …చికిత్సలు చేయడం ద్వారా ప్రజలపై తీవ్ర దుష్ప్రభావాలు కలిగే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వారు చదువుకున్న వైద్యవిద్య అనుసరించి చికిత్సను అందించడానికి మేము వ్యతిరేకించడం లేదని.. ఈ సమయంలో ప్రజలపై ఆరోగ్యంపై ప్రభావం చూపే విధంగా వారించడానికి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ కు నిరసనగా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు… అత్యవసర సేవలు తప్ప మిగిలిన అన్ని నిలిపివేస్తున్నట్లు చెప్పారు.