ప్రతిమ కాలేజీ యాజమాన్యంపై వైద్య విద్యార్థులు సీరియస్

ప్రతిమ కాలేజీ యాజమాన్యంపై వైద్య విద్యార్థులు సీరియస్

కరీంనగర్ లో ప్రతిమ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఫీజుల విషయంలో విద్యార్థులను వేధిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి ఈటల రాజేందర్, వైస్ చాన్సులర్ లు చెప్పినా కూడా ఈ విషయంలో ప్రతిమా కాలేజీ యాజమాన్యం వినిపించుకోవడం లేదని విద్యార్థులు అంటున్నారు.

మెడికల్ పీజీ చదువుకోసం మొదటి ఏడాది ఫీజు కాకుండా.. వచ్చే రెండేళ్లకు కలిపి మొత్తం మూడేళ్లకు ఒకేసారి  బ్యాంక్ గ్యారంటీ కట్టాలని ప్రతిమా కాలేజీ యాజమాన్యం డిమాండ్ చేస్తోందంటున్నారు విద్యార్థులు. చట్టం ప్రకారం ఒక్క ఏడాది ఫీజు ముందుగా కడితే చాలని అంటున్నారు. బ్యాంక్ గ్యారంటీ విషయంలో ఇబ్బంది పెట్టం అని చెప్పిన ప్రైవేటు మెడికల్ కాలేజీలు మళ్లీ తమను వేధిస్తున్నాని అంటున్నారు.

మూడేళ్లకు ఒకే సారి కట్టమంటే.. తమవల్ల కాదని… ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని వైద్య విద్యార్థులు చెబుతున్నారు. ఇపుడు జాయిన్ కాకపోతే కౌన్సిలింగ్ కు అనర్హులం అవుతామని అంటున్నారు.