
పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది నిజమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు భుట్టో. ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్తాన్ ప్రమేయం ఉందంటూ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై స్పందించిన భుట్టో ఈమేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ చరిత్ర తీవ్రవాదంతో ముడిపడి ఉందన్నది నిజమేనని అన్నారు భుట్టో. దాని ఫలితంగా దేశం నష్టపోయిందని.. ఆ తర్వాత పలు సంస్కరణలు చేపట్టామని అన్నారు భుట్టో.
పాకిస్తాన్ కు ఉగ్రవాదంతో సంబంధాలు ఉన్నాయన్నది రహస్యంగా బావించట్లేదని.. ఉగ్రదానికి మద్దతు ఇవ్వడం ద్వారా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయిందని అన్నారు భుట్టో. ఉగ్రవాదం తాలూకు ప్రభావాన్ని ఇప్పటికీ అనుభవిస్తున్నామని అన్నారు భుట్టో. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకున్నామని.. ఫలితంగా సంస్కరణలు చేపట్టామని అన్నారు భుట్టో.
Also Read:-దేశ రాజధానిపై ఉగ్రవాదుల కన్ను.. ఢిల్లీలో హై అలర్ట్.. సెక్యూరిటీ పెంపు
ప్రస్తుతం పాకిస్తాన్ శాంతి కోరుకుంటుందని.. భారత్ రెచ్చగొడితే యుద్దానికి సిద్ధమేనని అన్నారు భుట్టో. పాకిస్తాన్ శాంతియుత దేశమని, ఇస్లాం శాంతియుత మతమని అన్నారు భుట్టో... తాము యుద్ధం కోరుకోవడం లేదని.. కానీ ఎవరైనా సింధుపై దాడి చేస్తే, వారు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. మేము యుద్ధ ఢంకా మోగించము కానీ.. రెచ్చగొడితె మాత్రం పాకిస్తాన్ గర్జన భయంకరంగా ఉంటుందని అన్నారు భుట్టో.