పాయల్ సూసైడ్ కేసులో ముగ్గురు డాక్టర్లు అరెస్టు

పాయల్ సూసైడ్ కేసులో ముగ్గురు డాక్టర్లు అరెస్టు

ముంబై: కులం పేరిట సీనియర్ల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మెడికల్ పీజీ స్టూడెంట్​ పాయల్ తాడ్వి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆమె సూసైడ్ కు కారకులైన ముగ్గురు మహిళా డాక్టర్లను అగ్రిపుర పోలీసులు అరెస్టు చేశారు. హేమ అహుజ, భక్తి మెహర లను మంగళవారం అదుపులోకి తీసుకోగా మరో డాక్టర్ అంకిత ఖండేల్​వాల్ ను బుధవారం అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, యాంటీ రాగింగ్, ఐటీ యాక్టు, ఐపీసీ సెక్షన్ 360 కింద కేసు నమోదు చేశారు. ముంబైలోని బీవైఎల్ నాయర్ హాస్పిటల్‌లో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న పాయల్ తాడ్వీని సీనియర్లు అయిన ఈ ముగ్గురు డాక్టర్లు కులం పేరుతో వేధించేవారు. దీంతో ఆమె మే 22న ఆత్మహత్య చేసుకుంది. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ పాయల్ పనిచేసిన హాస్పిటల్ బయట ఆమె తల్లిదండ్రులు నిరసన చేప్టటారు. పేషెంట్ల ముందే ఆ ముగ్గురు నిందితులు పాయల్ ముఖంపై ఫైల్లు విసిరికొట్టేవారని, తమ కూతురు తమకు చెప్పిందని పాయల్ తల్లి చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ముగ్గురు నిందితులను సస్పెండ్ చేసింది. వీళ్లు తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నందునే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. దర్యాప్తు వివరాలతో పాటు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక అందించాలంటూ జాతీయ                 మహిళా కమిషన్ హాస్పి టల్ కు లేఖ రాసింది.