ఖాళీ చేయిస్తే.. డ్యూటీలు బహిష్కరిస్తామని మెడికోల ధర్నా

V6 Velugu Posted on Jan 17, 2022

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ లో మెడికోలు ధర్నాకు దిగారు. తమను ఆకారణంగా హాస్టళ్లు ఖాళీ చేయాలని అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హాస్టల్ నుంచి బలవంతంగా ఖాళీ చేయిస్తే...MGMలో డ్యూటీలు బహిష్కరిస్తామని మెడికోలు హెచ్చరించారు. రాత్రి, పగలు అని చూడకుండా రోగులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. డ్యూటీలు చేసి హస్టల్ కు వస్తే కరెంటు, వాటర్ కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చూపుతున్న ప్రత్యామ్నాయ భవనాల్లో కనీస వసతులు లేవని అంటున్నారు. మరింత సమాచారం ఆశోక్ అందిస్తారు.

 

Tagged Dharna, kakatiya medical college, medicine students,

Latest Videos

Subscribe Now

More News