- మెడికవర్ వైద్యుల వెల్లడి
- హాస్పిటల్లో ప్రత్యేక క్లినిక్ప్రారంభం
పద్మారావునగర్, వెలుగు: తెలంగాణలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు వెల్లడించారు. 35 నుంచి -50 ఏండ్ల మధ్య ఉన్న వారిలో ఈ సైలెంట్ కిల్లర్ కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయని చెప్పారు.
ఈ క్రమంలో మెడికవర్ హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ప్యాంక్రియాటిక్ క్లినిక్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. హాస్పిటల్లో శుక్రవారం వారు మాట్లాడారు. లక్షణాలు ఆలస్యంగా కనిపించడం వల్ల రోగులు చివరి దశలో హాస్పిటళ్లలో చేరుతున్నారన్నారు.
దేశంలో ఏటా 15 వేల కేసులు నమోదవుతుండగా, ఈ వ్యాధి పెరుగుదలకు అనారోగ్యకర జీవనశైలి, ఊబకాయం, డయాబెటిస్, స్మోకింగ్, మద్యం వంటి కారణాలు ప్రధానంగా ఉన్నాయని పేర్కొన్నారు. స్క్రీనింగ్, అవగాహన లోపం కూడా పెద్ద సమస్యగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మెడికవర్లో గ్యాస్ట్రో ఎంటరాలజీ, ఆంకాలజీ, హెపటో-ప్యాంక్రియో-బిలియరీ విభాగాలు కలిసి ప్రత్యేక క్లినిక్స్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డా. కృష్ణగోపాల్ భండారి, డా. సంతోష్, ఎం. నారాయణ్కర్, డా. అజయ్ శేషరావు షిండే, డా. పవన్ అడ్డాల ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.
