మీనాక్షి చౌదరి మోడ్రన్‌‌‌‌ మెరుపులు..

మీనాక్షి చౌదరి మోడ్రన్‌‌‌‌ మెరుపులు..

బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్‌‌‌‌తో ఫుల్ జోష్‌‌‌‌లో ఉంది మీనాక్షి చౌదరి.  లక్కీ భాస్కర్,  సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌లు అందుకున్న మీనాక్షి చౌదరి.. ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకెళుతోంది. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌‌‌‌గా ఉండే ఆమె.. తన గ్లామరస్ ఫొటోలతో యూత్‌‌‌‌ను ఆకట్టుకుంటోంది. ఓ వైపు చీరకట్టులో ట్రెడిషనల్‌‌‌‌గా కనిపిస్తూనే, మరోవైపు మోడ్రన్‌‌‌‌ కాస్ట్యూమ్స్‌‌‌‌లో మెరిసిపోతోంది. తాజాగా ఇలా లైట్ గ్రీన్ కలర్ డ్రస్‌‌‌‌లో ఫిదా చేసింది. 

ఇక ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తిక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమె ఆర్కియాలజిస్ట్‌‌‌‌గా కనిపించనుంది.  అలాగే నవీన్ పొలిశెట్టికి జంటగా ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలోనూ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది. తాజాగా ఓ తమిళ చిత్రంలోనూ అవకాశం అందుకున్నట్టు సమాచారం. ఏదేమైనా యంగ్ హీరోలతో మాత్రమే నటిస్తానని షరతులు పెట్టకుండా. సీనియర్స్ హీరోలకు జంటగా నటించడం ఆమె కెరీర్‌‌‌‌‌‌‌‌కు కలిసొస్తోంది.