జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించాలి : మహేశ్‌‌ కుమార్ గౌడ్

జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిచ్చినా గెలిపించాలి : మహేశ్‌‌ కుమార్ గౌడ్
  • మంత్రులు, చైర్మన్లు, కో ఆర్డినేటర్లకు మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ ఆదేశం
  • అభ్యర్థులుగా ముగ్గురి పేర్లను ఏఐసీసీకి పంపిన రాష్ట్ర నాయకత్వం

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ ఎవరికిచ్చినా ఐక్యంగా పనిచేసి అభ్యర్థిని గెలిపించాలని మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, కో ఆర్డినేటర్లను ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్‌‌ కుమార్ గౌడ్ ఆదేశించారు. ఆదివారం ప్రజా భవన్‌‌లో జూబ్లీహిల్స్ ఇన్‌‌చార్జ్‌‌ మంత్రులు తుమ్మల నాగేశ్వరావు, వివేక్ వెంకటస్వామి, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్‌‌తో పాటు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. 

ఎన్నికల ప్రచారం, ప్రభుత్వ స్కీమ్‌‌లను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఈ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. కాగా, జూబ్లీహిల్స్‌‌ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ నేత నవీన్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పేర్లను అభ్యర్థులుగా షార్ట్ లిస్ట్ చేసి ఏఐసీసీకి పంపినట్లు సమాచారం.