సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద బాధితులను ఆదుకుంటం : మీనాక్షి నటరాజన్

సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద  బాధితులను ఆదుకుంటం : మీనాక్షి నటరాజన్
  • కాంగ్రెస్ స్టేట్ ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్

పటాన్‌‌‌‌చెరు, వెలుగు: సిగాచి ఫ్యాక్టరీ ప్రమాద బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని కాంగ్రెస్ స్టేట్‌‌‌‌ ఇన్‌‌‌‌చార్జ్ మీనాక్షి నటరాజన్ తెలిపారు. ఈ ఘటనను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్‌‌‌‌గా తీసుకున్నారని చెప్పారు. బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ చీఫ్​మహేశ్​ కుమార్​గౌడ్‌‌‌‌తో కలిసి ఫ్యాక్టరీ వద్ద పరిస్థిని మీనాక్షి పరిశీలించారు. అనంతరం పటాన్‌‌‌‌చెరులోని ధ్రువ హాస్పిటల్‌‌‌‌లో ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతున్న కార్మికులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికే బాధితులకు నష్టపరిహారం చెల్లించిందని తెలిపారు. కంపెనీ నుంచి కూడా బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ ఘటనపై విచారణకు ఇప్పటికే కమిటీ వేశామన్నారు. గల్లంతైన కార్మికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని దామోదర పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ట్రీట్‌‌‌‌మెంట్ పొందుతున్న కార్మికుల పరిస్థితి నిలకడగా ఉందన్నారు.