- కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. సోమవారం రూరల్ మండలం ధర్మపూర్ లోని జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీని ప్రకృతి వైజ్ఞానిక బృందంతో కలిసి సందర్శించారు. ఈ యాత్ర జనవరి 27న సోమశిలలో ప్రారంభమై ఈ నెల28 వరకు కొనసాగుతుంది. ‘ప్రకృతిని రక్షించుకుందాం,- రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ నినాదంతో ఈ యాత్ర కొనసాగిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక నిర్వాహకుడు రమేశ్, గాయకుడు జయరాజు తెలిపారు.
ముందుగా మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి విగ్రహానికి మీనాక్షి నటరాజన్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మూఢనమ్మకాలను పక్కన పెట్టి శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్, ఓబేదుల్లా కొత్వాల్, రాష్ట్ర కళలు, సాంస్కృతిక చైర్మన్ వెన్నెల, డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, లైబ్రరీ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మిథున్ రెడ్డి పాల్గొన్నారు.
