దీపావళి రోజున పాక్షిక సూర్య గ్రహణం..

దీపావళి రోజున పాక్షిక సూర్య గ్రహణం..

అక్టోబర్ 25న సూర్య గ్రహణం సందర్భంగా ఆ రోజు మధురైలోని మీనాక్షి సుందరేశ్వర ఆలయాన్ని పది గంటల పాటు మూసివేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు గుడిని మూసివేస్తామన్న అధికారులు.. ఆ తర్వాతే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. ఇది ఈ ఆలయంలోని అన్ని ఉప ఆలయాలకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

27 ఏళ్ల క్రితం 1995లో దీపావళి రోజున ఈ సూర్యగ్రహణం ఏర్పడింది. మళ్లీ ఇలాంటిదే అక్టోబర్ 25న ఏర్పడబోతోంది. ఈ సంవత్సరంలో ఇది రెండో, చివరి సూర్యగ్రహణం కావడంతో ఇది పాక్షికంగానే ఉంటుంది. అయితే సూర్యగ్రహణం సమయం విషయానికొస్తే  అక్టోబర్ 24న దీపావళి రాత్రి 02:30కి ప్రారంభం అవుతుంది. మరుసటి రోజు అక్టోబర్ 25న సాయంత్రం 04:22 గంటల దాకా ఇది కొనసాగనున్నట్టు సమాచారం. ఈ సారి ఏర్పడ బోతున్న సూర్య గ్రహణం  మొత్తం వ్యవధి 4 గంటల 3 నిమిషాలు.