ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..మీరే హీరోలా సాంగ్ లాంచ్

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి..మీరే హీరోలా సాంగ్ లాంచ్

తనకు హను రాఘవపూడి సినిమాలంటే ఇష్టం..ఆయనతో ఓ సినిమా చేయాలని ఉందని హీరో సుధీర్ బాబు వెల్లడించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలన్నారు. AMBలో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా నుంచి ‘మీరే హీరోలా’ సాంగ్ ను చిత్ర టీం లాంచ్ చేసింది. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సుధీర్ బాబు, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 16న విడుదల కానున్న నేపథ్యంలో సాంగ్ లాంచ్ చేశారు. డైరెక్టర్ హను రాఘవపూడి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. ప్రముఖ జర్నలిస్ట్ కౌశిక్ ఇకలేరంటే నమ్మబుద్ది కావడం లేదన్నారు.

సినిమాని ప్రేక్షకులకు చేర్చేందుకు జర్నలిస్ట్ లు కీ రోల్ పోషిస్తారని, ఈ సాంగ్ ని జర్నలిస్ట్ లకి, ప్రత్యేకంగా బీఏ రాజుకి డెడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. తన ఫస్ట్ ఎఫైర్ ఇంద్రగంటి గారితోనేనని తెలిపారు. తాను 5 ఏళ్ళు జర్నలిస్ట్ గా వర్క్ చేసినట్లు.. అందుకే జర్నలిస్ట్ ల సమక్షంలో ఈ సాంగ్ ని రిలీజ్ చేయడం జరిగినట్లు దర్శకుడు ఇంద్రగంటి వెల్లడించారు. ఈ సాంగ్ ని జర్నలిస్ట్ లకి అంకితం చేస్తున్నట్లు, మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమాకయినా థియేటర్ కి వస్తారన్నారు. ప్రతి సినిమాలో సుధీర్ డిఫరెంట్ గా కనిపిస్తారని, డాక్టర్ కావాలని కల అని.. ఈ సినిమాలో వైద్యురాలిగా పోషిస్తున్నట్లు తెలిపారు.