దేవుడి గుడిలో మహిళా పూజారులు వీరే.. యుగాల తర్వాత ఫస్ట్ టైం ఇదే

దేవుడి గుడిలో మహిళా పూజారులు వీరే.. యుగాల తర్వాత ఫస్ట్ టైం ఇదే

తమిళనాడులో ఇకపై మహిళలు అర్చకులుగా పూజలు నిర్వహించనున్నారు.  తాజాగా అన్ని కులాలు వారు అర్చకులు కావొచ్చన్న పథకాన్ని స్టాలిన్ సర్కార్ తీసుకువచ్చింది.  అందులో భాగంగా ముగ్గరు మహిళలను(కృష్ణవేణి, ఎస్ రమ్య ,ఎన్ రంజిత)  ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ పూజారులుగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరిని త్వరలో రాష్ట్రంలోని ఆలయాల్లో సహాయ అర్చకులుగా నియమించనున్నారు. 

దీంతో ఈ మహిళలు ఆలయాల్లో మూలమూర్తులకు పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మహిళలు విమానం నడిపినా, అంతరిక్షానికి వెళ్లొచ్చినా వారు ప్రవేశించలేని ప్రదేశంగా ఆలయ గుర్భగుడి ఉంది. ఇకపై ఆ పరిస్థితి మారనుంది అని స్టాలిన్ ట్వీట్ చేశారు.   

గణితశాస్త్రంలో అండర్ గ్రాడ్యుయేట్ అయిన కృష్ణవేణి మాట్లాడుతూ..  తనకు భగవంతుని సేవ చేయాలని, తద్వారా ప్రజలకు సేవ చేయాలని, అందుకే శిక్షణను ఎంచుకున్నానని తెలిపింది.   ఈ శిక్షణలో తాను రూ. 3 వేల స్టైపెండ్  పొందింది. ఇక రంజిత బిఎస్సీ గ్రాడ్యుయేట్ పూర్తి చేయగా,  రమ్య ఎంఎస్సీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింది.