నుదుటి మీద తోకతో ఉన్న ఓ కుక్కపిల్ల ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెనుక భాగంతో పాటు దాని తల భాగంలో కూడా ఓ తోక .. చిన్నగా ఏనుగు తొండంలాగా ఉండడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. ఆ వీడియోను లైకులు , షేర్లు చేస్తున్నారు. అమెరికాకి చెందిన డాగ్ రెస్య్కూ సంస్థ ‘మాక్స్ మిషన్’ కు మిస్సోరి నగర వీధుల్లో ఈ కుక్కు పిల్ల దొరికింది. పది వారాల వయస్సు ఉన్న ఆ జంతువుకు నార్వాల్ అని పేరుపెట్టి జాగ్రత్తగా పెంచుతున్నారు. అయితే నార్వాల్ ఆడుకుంటున్న ఓ వీడియోను మాక్స్ మిషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ కుక్కపిల్ల ఆడుకుంటున్నప్పుడు దాని తోక అటూ ఇటూ కదులుతుండటం చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ.. భలే ముద్దుగా ఉందని, ఎంతకు అమ్ముతారంటూ కామెంట్‌లు పెడుతున్నారు. ఈ వీడియోకు హాలీవుడ్ నటుడు బ్రాఫ్ తో సహా ఎందరో జంతు ప్రేమికులు, ఫన్ లవర్స్ ఐదు లక్షల మంది లైకులు కొట్టారు.
look at him go, whalefact pic.twitter.com/N7G2uWMsym
— WeRateDogs® (@dog_rates) November 13, 2019

