డిసెంబర్ 07న సెట్స్ కన్వీనర్ల సమావేశం

డిసెంబర్ 07న సెట్స్ కన్వీనర్ల సమావేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టులపై తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కసరత్తు ప్రారంభించింది. దీంట్లో భాగంగా టీజీసీహెచ్ఈ ఆఫీసులో కౌన్సిల్ చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన ఈ నెల 7న సెట్స్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించనుంది. 

ఈ మీటింగ్​లో ప్రవేశ పరీక్షల నిర్వహణ, తేదీల ప్రతిపాదనలపై ప్రాథమికంగా చర్చించనున్నారు. అనంతరం ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్కో సెట్ వారీగా వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి, పరీక్షల తేదీలు, నోటిఫికేషన్ల షెడ్యూల్‌‌ను ఖరారు చేయనున్నారు.