మెగా 156 షురూ

మెగా 156 షురూ

చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌పై విక్రమ్, వంశీ,  ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. చిరంజీవి, సురేఖ దంపతులు కలిసి మేకర్స్‌‌కి స్క్రిప్ట్‌‌ను అందజేయగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు. 

సెలబ్రేషన్స్ సాంగ్ రికార్డింగ్‌‌తో సినిమాను ప్రారంభించారు. సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, డీవోపీ ఛోటా కె నాయుడుతో పాటు వివి వినాయక్, మారుతి తదితరులు పాల్గొన్నారు.