తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెగా హెల్త్ క్యాంప్

తలసేమియా వ్యాధిగ్రస్తులకు మెగా హెల్త్ క్యాంప్

మంచిర్యాల, వెలుగు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల రక్త నిధి కేంద్రం ఆధ్వర్యంలో తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ నెల 11న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి తెలిపారు.

గురువారం మంచిర్యాలలో మాట్లాడుతూ, ఈ హెల్త్ క్యాంప్​కోసం హైదరాబాద్ నుంచి వైద్య నిపుణులు వస్తున్నారని.. తలసేమియా, సికిల్ సెల్, సికిల్ తాల్ పేషెంట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.