మెగా యంగ్ హీరోలంటే సినీ ఫ్యాన్స్కు ఎల్లప్పుడూ క్రేజీనే. వారి సినిమాల అప్డేట్స్ వచ్చిన, అందరూ కలిసి ఒకే ఫంక్షన్లో కనిపించిన అది పండుగనే చెప్పుకోవాలి. ఇవాళ ఆదివారం (ఆగస్టు9న) హీరోలు రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కలిసి జిమ్‌కి వెళ్లారు.
అక్కడ ఈ ముగ్గురు కలిసి తీసుకున్న ఓ ఫోటోని వరుణ్ తన సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇందులో తమ స్టైలిష్ మేకోవర్స్తో మెగా హీరోలు ఆకట్టుకున్నారు. పూర్తిగా పెరిగిన గడ్డం, చక్కటి ఆకారంలో ఉన్న కండరపుష్టితో చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇందులో చరణ్ జిమ్‌లో వర్కౌట్స్ చేసి బాగా అలసిపోయి చెమటలతో నిండిపోయాడు.
అంతేకాకుండా.. ఒకరివెనుక ఒకరు నిల్చుని విశ్రాంతి తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడమని, ఫిట్‌గా ఉండటానికి ఎంత సాహసమైన చేస్తామంటూ, తమ ఫ్యాన్స్కు చెప్పకనే చెప్తున్నారు. దాంతో ఈ మెగా ఫోటో ఇంటర్నెట్ ని షేక్ చేయడం మొదలుపెట్టింది.
ఈ క్రమంలో ముగ్గురు హీరోల ఫ్యాన్స్.. ఫోటోని రీ పోస్టు చేస్తూ.. వారి కొత్త సినిమా టైటిళ్ల హ్యాష్‌ట్యాగ్‌లను జోడిస్తున్నారు. దీంతో #Peddi మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒకేసారి ఒకేఫోటోలో దర్శనమిచ్చిన వీరు సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
పెద్ది:
రామ్ చరణ్ కెరియర్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం 'పెద్ది'. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రూరల్ స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న చరణ్ పుట్టినరోజు సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
సంబరాల ఏటిగట్టు:
సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల యేటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ మూవీ నిర్మాతలు కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. కెరీర్‌లో మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో తేజ్ కనపించబోతున్నాడు. సెప్టెంబర్ 25న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.
కొరియన్ కనకరాజు:
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీకి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
కదిరి నరసింహ సామి సాచ్చిగా ఈ తూరి నవ్వించేకి వస్తుండా!
— Varun Tej Konidela (@IAmVarunTej) January 19, 2025
Let's do this @gandhimerlapaka @musicthaman 👊#VT15 @Uv_creations @FirstFrame_ent
감사합니다. pic.twitter.com/1XS47rDsmB
