గోదావరిఖని లో మే 18న మెగా జాబ్​మేళా : ఎమ్మెల్యే ఎంఎస్ ​రాజ్​ఠాకూర్​

గోదావరిఖని లో మే 18న మెగా జాబ్​మేళా : ఎమ్మెల్యే ఎంఎస్ ​రాజ్​ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని సింగరేణి జేఎన్​స్టేడియంలో ఈ నెల 18న నిర్వహించనున్న మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిరుద్యోగులకు సువర్ణావకాశమని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఠాకూర్​ తెలిపారు. గురువారం క్యాంప్​ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాబ్​మేళా పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సింగరేణి జీఎంలు డి.లలిత్​ కుమార్​, బి.వెంకటయ్య, ఏసీపీ ఎం.రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయిమెంట్ అసోసియేషన్​, సింగరేణీ కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళాలో 100 కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో సింగరేణి ఆఫీసర్లు కిరణ్​బాబు, కుమారస్వామి, వరప్రసాద్​, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. .