హుజూరాబాద్‌‌‌‌లోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా 

హుజూరాబాద్‌‌‌‌లోని సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ లో మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా 

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం మెగా జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సహకారంతో సిటీ సెంటర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఈ జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళా నిర్వహించారు. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళాకు సుమారు 5వేల మంది అభ్యర్థులు హాజరయ్యారు. సుమారు 85 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. జాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేళాకు వచ్చిన అభ్యర్థులకు భోజన ఏర్పాట్లు, వాలంటీర్ల నియామకం, హెల్ప్ డెస్కులు, ఇంటర్వ్యూల కోసం ప్రత్యేక చాంబర్లు ఏర్పాట్లు చేపట్టారు.