మెహదీపట్నంలో ఇయ్యాల (అక్టోబర్ 30 న) మెగా జాబ్మేళా

మెహదీపట్నంలో ఇయ్యాల (అక్టోబర్ 30 న) మెగా జాబ్మేళా

హైదరాబాద్ సిటీ, వెలుగు: పోలీస్ స్మృతి వారోత్సవాల సందర్భంగా సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు, డెక్కన్ బ్లాస్టర్స్​కలిసి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి మెహదీపట్నంలోని రూప్ గార్డెన్ ఫంక్షన్ హాల్​లో జరిగే ఈ మేళాలో..  ఐటీ, సాఫ్ట్​వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ, ప్రైవేట్ సెక్టార్లతో పాటు అకౌంట్స్, టెక్నికల్, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఫ్రెషర్స్, అనుభవజ్ఞులు అందరూ పాల్గొనవచ్చని పోలీసులు తెలిపారు. 

ఎస్సెస్సీ, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీటెక్, బీఫార్మ, ఎంఫార్మ అర్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యా సర్టిఫికెట్లు, ఫొటోలు, రెజ్యూమ్​తో హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 8712661501ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.