ఉద్యోగాల సాధనకు కృషి చేయాలి : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

ఉద్యోగాల సాధనకు కృషి చేయాలి : టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి

పాలకుర్తి, వెలుగు: ప్రజా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఫ్యామిలీ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తి సోమేశ్వర స్వామి కల్యాణ మండపంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఆమె స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ జాబ్ మేళాలో పేరున్న 36 కంపెనీలు పాల్గొన్నాయి. యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. 

ఈ మేళాలో నెలకు రూ.20 వేల నుంచి రూ.లక్ష వేతనం వరకు యువత ఉద్యోగ అవకాశాలు దక్కించుకున్నారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పాలకుర్తి ఏఎంసీ చైర్మన్ లావుడియా మంజుల భాస్కర్, పాలకుర్తి, తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జాటోత్ హమ్యా నాయక్, రాపాక సత్యనారాయణ, పాలకుర్తి, రాయపర్తి, కొడకండ్ల మండలాధ్యక్షులు తదితరులు  పాల్గొన్నారు.