ఈ నెల 5న మెగా జాబ్ మేళా

ఈ నెల 5న మెగా జాబ్ మేళా

హన్మకొండ: నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో హన్మకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రాష్ట్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 5న హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. జియో మార్ట్, ఫిపోలా, హెచ్ఎఫ్సీ సేల్స్, అపోలో, స్విగ్గీ, ఇన్నోవ్, టాటా ప్లే వంటి ప్రముఖ కంపెనీలు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు. పదో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు చదివిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 7097655912, 9030047303 నెంబర్లను సంప్రదించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు.

మరిన్ని వార్తల కోసం

ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ విద్య

ఏప్రిల్‌ 25న యాదాద్రిలో శివాలయం పునఃప్రారంభం