వీకెండ్ టూర్ కు బయలుదేరిన చెర్రీ

వీకెండ్ టూర్ కు బయలుదేరిన చెర్రీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన చెల్లెళ్లు, మేన కోడళ్లు, స్నేహితులతో కలిసి సరదాగా దిగిన ఫొటోలు ఇవి. ఈ ఫొటోలలో రాంచరణ్ ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్క ‘రైమ్’ ను కూడా చూడొచ్చు. వీకెండ్ టూర్ కోసం విమానంలో అందరూ కలిసి బయలుదేరే సమయంలో ఈ ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను రాంచరణ్ భార్య ఉపాసన కొణిదెల తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 

రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి జరిగి పదేళ్లు. 2012 జూన్ 14న వారి పెళ్లి జరిగింది. ఈ ఏడాది జూన్ 10న పదో వివాహ వార్షికోత్సవ వేడుకల కోసం వీరిద్దరు  ఇటలీలోని ఫ్లోరెన్స్ నగరానికి వెళ్లారు. ఆ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి.  ఉపాసన సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ ఉంటారు. నిత్యం రామ్ చరణ్, మెగా ఫ్యామిలీకి సంబంధించిన అప్ డేట్స్ ను పోస్ట్ చేస్తుంటారు. ఆమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోయర్స్ ఉన్నారు. అప్పుడప్పుడు నెటిజన్స్ కు ఆరోగ్యపరమైన సందేశాలను కూడా ఉపాసన ఇస్తుంటారు.