హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ లో మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. పదో రోజు గురువారం స్లమ్ ఏరియాల్లో వ్యర్థాల తొలగింపు, క్లీనింగ్ పై ఫోకస్ పెట్టారు.
300 వార్డుల్లో ఈ కార్యక్రమం కొనసాగింది. డ్రైవ్ లో భాగంగా 9వ రోజు బుధవారం వరకు 3,094 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఓఆర్ ఆర్ వరకు పరిధి విస్తరించిన తరువాత జీహెచ్ఎంసీ తొలిసారిగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నది.
