టిల్లు స్క్వేర్ టీమ్‌‌ను అభినందించిన చిరంజీవి

టిల్లు స్క్వేర్ టీమ్‌‌ను అభినందించిన చిరంజీవి

‘టిల్లు స్క్వేర్’ చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని  మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన  ఈ సినిమా  ఇటీవల విడుదలై,  థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

తాజాగా సినిమా చూసిన చిరంజీవి.. మూవీ టీమ్‌‌ను అభినందించారు.  ‘డీజే టిల్లు’ తనకు  బాగా నచ్చిన చిత్రమని, ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ కూడా చాలా బాగుందని చిత్ర యూనిట్‌‌పై ప్రశంసలు కురిపించారు.