మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ తన వ్యక్తిగత, వృత్తిపరమైన అప్డేట్ గురించి అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందించారు. ఈ రోజు ఆయన ( నవంబర్ 17న ) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ తర్వాత బ్రేక్ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన తేజ్.. ఎన్నో రోజులుగా చక్కర్లు కొడుతున్న తన పెళ్లి రూమర్స్‌పై స్పష్టతనిచ్చారు. "వచ్చే ఏడాదిలోనే నా పెళ్లి ఉంటుంది" అని వెల్లడించారు. తన వివాహం గురించి తేజ్ స్వయంగా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
తిరుమల కొండపై బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న తేజ్... తనకు మంచి సినిమాలు, మంచి జీవితాన్ని ప్రసాదించిన ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పేందుకే వచ్చానని తెలిపారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది అందరికి మంచి జరగాలని అన్నారు. తన ‘సంబరాల ఏటిగట్టు’ మూవీ విడుదల గురించి తెలిపారు.
'సంబరాల ఏటిగట్టు' రిలీజ్ డేట్..
తన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలపైనా అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుందని సాయి దుర్గా తేజ్ తెలిపారు. రోహిత్ కె.పి. దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ‘SDT18’ కాగా, దీనికి ‘SYG’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, ‘సంబరాల ఏటిగట్టు’ అనే క్యాప్షన్‌గా పెట్టారు.
►ALSO READ | CP Sajjanar: 'ఐబొమ్మ'తో రూ. 20 కోట్లు వెనుకేసుకున్న రవి.. నేర చరిత్ర బయటపెట్టిన సీపీ సజ్జనార్!
రామ్ చరణ్ చేతుల మీదుగా విడుదలైన గ్లింప్స్.. అసుర సంధ్యవేళ, రాక్షసుల ఆగమనం అంటూ పవర్ ఫుల్ డైలాగ్‌లతో, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఓ సాలిడ్ యాక్షన్ డ్రామాగా అంచనాలను పెంచింది. అణచివేతకు గురవుతున్న ప్రజల కోసం హీరో చేసే పోరాటమే ఈ కథాంశమని తెలుస్తోంది. కె. నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 'విరూపాక్ష', 'బ్రో' చిత్రాల తర్వాత సాయి దుర్గా తేజ్ చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఒకపక్క కెరీర్‌లో కొత్త శిఖరాలను అందుకుంటూ, మరోపక్క వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్న తేజ్‌కు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
VIDEO | Andhra Pradesh: Actor Sai Dharam Tej visits Tirumala temple.
— Press Trust of India (@PTI_News) November 17, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/jD6YoCLMDR
