
రామ్ చరణ్ సతీమణి ఉపాసనపై తప్పుడు వాఖ్యలు చేసినందుకు సునిశిత్ అనే వ్యక్తికి దేహశుద్ది చేశారు మెగా ఫ్యాన్స్. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునిశిత్ మాట్లాడుతూ.. "ఉపాసన నాకు ఫ్రెండ్. ఆమెకు ఒక ఎలెక్ట్రిక్ కారు ఉంది. ఆ కారులో మేమిద్దరం గోవా కూడా వెళ్లాం" అంటూ కామెంట్ చేసాడు. ఇదంతా మెగా ఫ్యాన్స్ వింటున్నారు అనవసరంగా తన్నులు తింటారు అంటూ యాంకర్ వార్నింగ్ ఇచ్చింది.
"లేదు నన్ను ఎవరూ కొట్టరు. ఎందుకంటే రాంచరణ్ కూడా నాకు ఫ్రెండ్. ఉపాసనతో నార్మల్ గా చాట్ చేస్తుంటే.. రాంచరణ్ స్వయంగా ఉపాసనని పడేయ్ అని తనతో చెప్పాడని సునిశిత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహించిన చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ను చితకబాదారు. అనంతరం సునిశిత్ తో క్షమాపణ చెప్పించారు.
"ఒక ఇంటర్వ్యూలో నేను ఉపాసన గారి గురించి తప్పుగా మాట్లాడానని, ఇక మీదట ఏ సెలెబ్రిటీ గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయనని, ఉపాసన వదినమ్మ గారికి, రాంచరణ్ క్షమాపణ కోరుతున్నా అని చెప్పుకొచ్చాడు సునిషిత్. ఇక చరణ్ ఫ్యాన్స్ సునిశిత్ ను కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.