కాజల్ దంపతులకు మెగాస్టార్ విషెస్

V6 Velugu Posted on Dec 15, 2020

కోకాపేట: చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న స్నేహితుడు బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లూను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్టోబ‌ర్ 30న ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్‌‌లో వీరి పెళ్లి వేడుక జరిగింది. పెళ్లి తర్వాత హనీమూన్‌కు వెళ్లిన కాజ‌ల్ అగర్వాల్ రీసెంట్‌‌గా తిరిగొచ్చింది. మంగళవారం ఉదయం `ఆచార్య` షూటింగ్‌‌లో కాజల్ జాయిన్ అయ్యింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌‌లోని కోకాపేటలో వేసిన భారీ సెట్లో మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ అగ‌ర్వాల్ మీద పాట చిత్రీకరణ జరుగుతోంది. కాజ‌ల్ భ‌ర్త గౌత‌మ్ కిచ్లు ఆచార్య సెట్స్‌‌కు విచ్చేసి చిత్ర‌ బృందాన్ని స‌ర్ ప్రైజ్ చేశారు.

కాజ‌ల్-కిచ్లు జంట‌కు మెగాస్టార్ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త జంటతో దండ‌లు మార్పించి కేక్ కట్ చేయించి వారిని ఆశీర్వ‌దించారు. ఈ సెల‌బ్రేష‌న్స్‌‌లో చిరంజీవితోపాటు మూవీ డైరెక్టర్ కొర‌టాల శివ‌, సినిమాటోగ్రాఫ‌ర్ తిరు, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్, సహ నిర్మాత అన్వేష్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్ పై ఎస్.నిరంజన్ రెడ్డి ఈ ఫిల్మ్‌‌ను నిర్మిస్తున్నారు.

Tagged gautham kitchlu, MegaStar Chiranjeevi, Wishes, Aacharya movie, kajal agarwal, koratala shiva

Latest Videos

Subscribe Now

More News